ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 8:48 am Posted by : ARJUN SAMAACHAARAM DESK

రాజాపూర్‌లో ఎస్‌ఐఆర్‌పై గ్రామసభ :సర్పంచ్ పుల్లెల భాగ్యలక్ష్మి, ఆధ్వర్యంలో అవగాహన

రాజాపూర్‌లో ఎస్‌ఐఆర్‌పై గ్రామసభ :సర్పంచ్ పుల్లెల భాగ్యలక్ష్మి, ఆధ్వర్యంలో అవగాహన

రామగిరి, సెప్టెంబర్ 19. అర్జున్ సమాచారం ప్రతినిధి.

రామగిరి మండలం రాజాపూర్ గ్రామంలో ఎస్‌ఐఆర్‌ (SIR)పై గ్రామసభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పుల్లెల భాగ్యలక్ష్మి .ఉపసర్పంచ్ కలవేన శ్రీకాంత్ .ఆధ్వర్యంలో శనివారం ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు సంబంధించిన అంశాలపై గ్రామస్తులకు అధికారులు అవగాహన కల్పించారు. ఓటర్ల జాబితా సవరణ, వివరాల పరిశీలన తదితర అంశాలపై ప్రజలకు వివరించారు. గ్రామస్తులు తమ ఓటరు వివరాలను పరిశీలించుకుని, ఏవైనా తప్పులు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో రామగిరి మండల తహసీల్దార్ సుమన్, GPO రాజేష్, గ్రామ కార్యదర్శి కిరణ్, వార్డు సభ్యులు, పుల్లెల సుజాత సతీష్.కాల్వ రజిత. శ్రీనివాస్  కలవేన వనిత. మాజీ ఉప సర్పంచ్ సోటేమియ్.ఉగ్గె మంగా,గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.